మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ కు చుక్కెదురైంది. HCA(Hyderabad Cricket Association) ఎన్నికల వ్యవహారంలో ఎదురుదెబ్బ తగిలింది. హెచ్.సి.ఎ. ఎలక్షన్లలో ఓటు వేసే అవకాశం ఇప్పించాలని ఈ మాజీ క్రికెటర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. వెంటనే జోక్యం(Interfere) చేసుకుని న్యాయం చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో తక్షణ జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) నిరాకరించింది. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. దీంతో ఈ మాజీ క్రికెటర్ కి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏమిటీ వివాదం… ఎందుకీ కేసు
HCA ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు నుంచి మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ పేరును తొలగించారు. ఎలక్షన్లలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేశారు. జోడు పదవుల అంశంలో వచ్చిన కంప్లయింట్ పై పరిశీలన జరిపిన కమిటీ.. అజహర్ కు రెండు పదవులు ఉన్నాయని నిర్ధారించింది. అధ్యక్షుడిగా పనిచేస్తూనే దక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్(DBCC)కు ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించడాన్ని సీరియస్ గా తీసుకుంది. జోడు పదవులు(HCA, DBCC) వాడుకుంటున్నందున ఎన్నికల్లో అజహర్ పోటీ చేయకుండా జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీ ఆయన పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. HCA వ్యవహారాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్ రావు నేతృత్వంలో గతంలోనే కమిటీ ఏర్పాటైంది.