తెలంగాణలో BJP ప్రభుత్వం(Government) ఏర్పడాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదిలాబాద్ సభకు అటెండ్ అయిన షా.. కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేశానని కేసీఆర్ అంటున్నారు.. రైతుల ఆత్మహత్యల విషయంలో నంబర్ వన్ చేశారు.. అవినీతి విషయంలో తెలంగాణ నంబర్ వన్ అయింది.. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సెప్టెంబరు 17 ఉత్సవాల్ని అధికారికంగా జరుపుతాం.. 950 కోట్లతో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం.. జాతీయ పసుపు బోర్డు రాకతో పంట ఎగుమతుల ద్వారా రైతులకు మంచి ఆదాయం దక్కుతుంది.. అయోధ్యలో రామ మందిరం కట్టాలా వద్దా’ అని కామెంట్స్ చేశారు.
చంద్రయాన్-3, సర్జికల్ స్ట్రైక్స్ విజయాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లు, దళితులు, గిరిజనుల కోసం ప్రత్యేక స్కీమ్ లు అందిస్తున్న తీరును అమిత్ షా వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.