మాదక ద్రవ్యాల(Drugs) కేసులో సినీ నటుడు నవదీప్ ను ED(Enforcement Directorate) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు నోటీసులు జారీ కాగా.. మంగళవారం నాడు ED ఆఫీసులో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. బాలీవుడ్ డ్రగ్స్ వినియోగంతోపాటు వాట్సాప్ ఛాటింగ్, ఇతర లావాదేవీలపై వివిధ కోణాల్లో వివరాలు రాబట్టినట్లు అర్థమవుతున్నది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి ఆయన్ను పంపించివేశారు. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ పెడ్లర్ పోలీసులకు దొరకడంతో ముఠా బయటపడింది. సినీ సెలెబ్రిటీలకు కెల్విన్ మస్కరెన్హాస్ అనే పెడ్లర్ మత్తు పదార్థాల్ని సరఫరా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.
మొన్నటి ఆగస్టు 31న హైదరాబాద్ మాదాపూర్ అపార్ట్ మెంట్ లో దొరికిన డ్రగ్స్ కేసులోనూ ఇంతకుముందే నవదీప్ పై రాష్ట్ర నార్కోటిక్ పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. గత కొన్నేళ్ల కాలంలో నవదీప్ పై పలు మార్లు ఆరోపణలు రాగా పోలీసు ఏజెన్సీల విచారణకు అటెండ్ అయ్యారు. తాజాగా ఈడీ కూడా నవదీప్ ను ఇంటరాగేషన్ చేసి వివరాలు రాబట్టింది.