ప్రపంచకప్(World Cup) లో ఆతిథ్య భారత జట్టు తన సెకండ్ మ్యాచ్ ఆడబోతున్నది. తొలి మ్యాచ్ లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లోనూ అద్భుత విజయం సాధించిన టీమ్ఇండియా.. నేడు పసికూనతో జరిగే మ్యాచ్ లోనూ భారీ తేడాతో గెలవాలని చూస్తున్నది. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు జరిగే మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లు ఆడే అవకాశముంది. అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్ కు అనుకూలిస్తుండటంతో జడేజా, కుల్దీప్ కు తోడు అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
పాక్ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్
ఇక ఈ మ్యాచ్ ను ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. ఈ నెల 14న పాకిస్థాన్ తో కీలక పోరు ఉన్న దృష్ట్యా అఫ్గాన్ తో మ్యాచ్ ను ప్రాక్టీస్ గా భావిస్తున్నది. అటు అఫ్గాన్ జట్టులో రషీద్ ఖాన్ ఆల్ రౌండర్ గా ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. IPL అనుభవంతో భారత్ లో పిచ్ లపై మంచి అవగాహన ఉన్న రషీద్.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రభావం చూపగలడని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.