PHOTO: ONmanorama
తీవ్ర యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్(Israel) నుంచి భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే తొలి విమానంలో 213 మందిని తీసుకువచ్చిన ప్రభుత్వం తాజాగా మరో 235 మందిని మన దేశానికి తరలించింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో వందల సంఖ్యలో భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దేశ వాసులను ఇక్కడకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ పేరిట విమానాల్ని పంపుతున్నది. అందులో భాగంగా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రెండో విమానం ద్వారా 235 మంది స్వదేశానికి విచ్చేశారు. ఇదే తీరుగా మరిన్ని ఫ్లైట్స్ పంపి ‘ఆపరేషన్ అజయ్’ని పూర్తిస్థాయిలో సక్సెస్ ఫుల్ చేయాలని మన విదేశాంగ శాఖ భావిస్తున్నది.
ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్..
ఎవరైతే ముందుగా భారత రాయబార కార్యాలయాన్ని(Indian Embassy)ని సంప్రదిస్తారో వారికే ముందుగా అవకాశం కల్పిస్తున్నారు. అంటే ‘ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్’ విధానంలో భాగంగా తరలింపు ప్రక్రియ కంటిన్యూ అవుతున్నది. గాజా సిటీపై భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధపడటంతో ఇక అక్కడున్న భారతీయులు అందరినీ స్వదేశానికి తీసుకురావాలన్న నిర్ణయానికి విదేశాంగ శాఖ వచ్చింది.