ప్రపంచ మెగా ఈవెంట్ అయిన ఒలింపిక్స్(Olympics) అంటే అందరికీ ఆసక్తే. ఈ క్రీడల్లో సాధించే పతకాలు.. దేశాలు, క్రీడాకారుల ఘనతను చాటి చెబుతాయి. అలాంటి ప్రతిష్ఠాత్మక క్రీడల్లో ఇక నుంచి క్రికెట్ రంగ ప్రవేశం చేయబోతున్నది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో క్రికెట్ కు ప్లేస్ కల్పిస్తూ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. క్రికెట్ సహా మొత్తం 5 క్రీడలకు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఐదింటిలో క్రికెట్, బేస్ బాల్-సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లక్రాస్, స్క్వాష్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ(IOC) అధ్యక్షుడు థామస్ బాచ్ అనౌన్స్ చేశారు.
ఇప్పటివరకు ఒకే ఒలింపిక్స్ లో క్రికెట్
1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు కల్పించారు. ఈ మెగా ఈవెంట్ లో క్రికెట్ ఆడటం అదే మొదటి, చివరిసారి కావడం విశేషంగా నిలిచింది. ఆ తర్వాత ఇన్ని దశాబ్దాలకు మళ్లీ క్రికెట్ కు ప్లేస్ దక్కడంతో దీన్ని ఆడే దేశాల్లో ఆనందం కనిపిస్తున్నది.