అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాతో పంచుకున్న ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. బన్నీకి విషెస్ చెప్పాడు. ‘పుష్ప’ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడి(National Best Actor) అవార్డు అందుకున్న సందర్భంగా వార్నర్.. అవార్డుల విజేతల ఫొటోను ఇన్ స్టాగ్రామ్(Instagram)లో షేర్ చేశాడు. ఇప్పటికే అల్లు అర్జున్ కు సినీ ప్రముఖులు, వివిధ రంగాల్లోని సెలెబ్రిటీలు గ్రాండ్ విషెస్ తెలియజేయగా.. ఇండియా అంటే ఇష్టపడే వార్నర్ సైతం తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ‘కంగ్రాచ్యులేషన్స్ అండ్ వెల్ డన్’ అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. గత IPL సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన వార్నర్.. తెలుగు ఆడియన్స్ అన్నా నటులన్నా ప్రత్యేక ఇష్టాన్ని ఏర్పరచుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోల ఫేమస్ డైలాగ్స్, డ్యాన్స్ లకు స్టెప్పులేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
69వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్ని విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా వీరందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుపొందిన ఘనత అల్లు అర్జున్ కే దక్కింది.