
నామినేషన్ల ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. కానీ ప్రలోభాలు మాత్రం జోరుగా ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ఓటర్లను ఆకట్టుకునేందుకు తరలిస్తున్న నగదు, బంగారం, మద్యాన్ని భారీగా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అదనుగా పెద్దయెత్తున హవాలా మనీ దొరుకుతున్నది. గత 10 రోజుల్లోనే రూ.166 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం(Recovery) చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టాలన్న లక్ష్యంతో చేపట్టిన పోలీసుల ఆపరేషన్ ఈ లెక్కన గ్రాండ్ సక్సెస్ తో కొనసాగుతున్నది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు(Check Posts) ఏర్పాటు చేయడం, ప్రధాన ప్రాంతాల్లో(Main Areas) వెహికిల్ చెకింగ్స్ లో భారీగా సొత్తు స్వాధీనమవుతున్నది.
బంగారం, వెండి, చీరలు, లిక్కర్
రూ.6.25 కోట్ల నగదు, రూ.22.65 కోట్లు విలువ చేసే బంగారం, వెండితోపాటు నల్లబెల్లం, చీరలు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం కార్యాలయం ప్రకటించింది. నిజామాబాద్ లోని శివాజీ చౌక్ లో చేపట్టిన వెహికిల్స్ చెకింగ్ లో ఎలాంటి ఆధారాల్లేని రూ.63.40 లక్షల హవాలా సొమ్మును పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కారులో రూ.40 లక్షల్ని గుర్తించి నగదును సీజ్ చేశారు. గోవా-బెళగావి దారిలో అక్రమం(Illegal)గా లారీలో తరలిస్తున్న రూ.10 లక్షల విలువైన లిక్కర్ ను కర్ణాటక ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన సొత్తును ఆదాయపన్ను శాఖకు అప్పగిస్తున్నారు.