ఇప్పుడు వస్తున్న ఫోన్లన్నీ ఇంచుమించు రెండు సిమ్ కార్డులతో పనిచేస్తున్నవే ఉంటున్నాయి. ఒకటి పర్సనల్, మరొకటి అఫీషియల్ అన్న తీరుగా ఒకే మొబైల్ ద్వారా రెండు సిమ్ కార్డుల్ని వాడుతున్న వారి సంఖ్య కోట్లల్లో ఉంది. అయితే రెండు సిమ్ కార్డులు వాడుతున్నా(Use) వాట్సాప్ మాత్రం రెండింటికి ఒకేసారి చూసుకునే అవకాశం ఇప్పటిదాకా లేదు. ఒక సిమ్ కార్డు వాట్సాప్ ను లాగౌట్ చేస్తేనే మరో సిమ్ కార్డుకు సంబంధించిన వాట్సాప్ ను చూడొచ్చు. కానీ ఇక నుంచి ఈ విధానం మారబోతున్నది. వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులకు శ్రీకారం చుట్టే వాట్సాప్ సంస్థ.. తాజాగా మరో నిర్ణయాన్ని ప్రకటించింది.
లాగౌట్ చేయకుండానే
రెండు సిమ్ కార్డులు వాడే ఫోన్లలో రెండు వాట్సాప్ లు యూజ్ చేసే అవకాశం ఉన్నా ఒకటి లాగౌట్ చేస్తేనే మరొకదాన్ని ఓపెన్ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా ఉంది. కానీ ఇప్పుడు లాగౌట్ చేయకుండానే రెండు వాట్సాప్ లను ఒకేసారి వాడుకునే అవకాశం కల్పిస్తోంది ఆ సంస్థ. ప్రస్తుతం అన్ని ఫోన్లు రెండు సిమ్ కార్డులతో పనిచేస్తున్న దృష్ట్యా కస్టమర్లకు ఏకకాలంలో రెండు నంబర్లకు గల వాట్సాప్ లను వాడుకోవచ్చన్న శుభవార్తను తెలిపింది. కొత్తగా వచ్చే ఫీచర్ తో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల(Android Customers)కు త్వరలోనే ఈ ఫీచర్(Feature)ను అందుబాటులోకి తెస్తున్నట్లు మెటా CEO(Chief Executive Officer) మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు.