ఉపాధ్యాయ నియామక పరీక్ష(Teacher Recruitment Test) దరఖాస్తుల గడువును పొడిగించారు. TRT అప్లికేషన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన అభ్యర్థులు(Candidates) సెప్టెంబరు 20 అక్టోబరు 21 వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలని గతంలోనే పాఠశాల విద్యాశాఖ సూచించింది. రేపటితో ఈ గడువు ముగియనున్న దృష్ట్యా మరో వారం పాటు ఈ నెల 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీలతోపాటు మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు TRT నిర్వహిస్తామని ఇంతకుముందే ప్రభుత్వం తెలిపింది. నవంబరు 20 నుంచి 30 మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(Computer Based Tests) నిర్వహించనున్నారు. తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ ఆన్ లైన్(Online) పరీక్షలను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో TRT పరీక్షలు జరుగుతాయి.