తెలంగాణ కోసం తన వంతు పోరాటం అయిపోయిందని, ఇక చేయాల్సింది ప్రజలేనని ముఖ్యమంత్రి(Chief Minister) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నా పోరాటంలో నిజాయతీ ఉంది కాబట్టే సక్సెస్ అయ్యానని గుర్తు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు కోసం 24 సంవత్సరాల క్రితం ఒంటరి ప్రయాణం(Journey) ప్రారంభించానని, తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఈ లీడర్లంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని విమర్శించారు.
కర్ణాటకలో పంటలు ఎండిపోతున్నయ్
కాంగ్రెసోళ్లు 20 గంటలు కరెంటిస్తామని కర్ణాటకలో హామీ ఇచ్చినా అది సాధ్యం కాక బోక్కాబోర్లా పడ్డారని KCR అన్నారు. అక్కడ 5 గంటల పాటు కూడా కరెంటు ఇవ్వట్లేదని, దీంతో పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు. అలాంటి వ్యక్తులు మనకు ఉపన్యాసాలు(Speeches) ఇస్తున్నారని విమర్శలు చేశారు.