
సీనియర్ హీరో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య త్వరలో పెళ్లి పీటలెక్కనుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2013లో హీరోయిన్గా కోలీవుడ్లో అడుగుపెట్టిన ఐశ్వర్య.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ పెద్దగా రాణించలేకపోయింది. అయితే జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఆమె లవ్లో ఉందని సమాచారం. ఉమాపతి కూడా నటుడే కాగా.. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయని, త్వరలోనే పెళ్లి చేయాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

ఐశ్వర్య 2013లో అర్జున్ విశాల్, సంతానం కలిసి నటించిన యాక్షన్ కామెడీ ‘పట్టతు యానై’ చిత్రంతో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తర్వాత తండ్రి అర్జున్ దర్శకత్వం వహించిన ‘ప్రేమ బరాహ’ చిత్రంలో 2018లో తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. మరోవైపు ఉమాపతి 2017లో ‘అడగపట్టత్తు మగజనంగళయ్’ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఇక ఐశ్వర్య తండ్రి మాదిరే అతను కూడా తన తండ్రి దర్శకత్వంలో ‘మణియార్ కుటుంబం’ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
