
ఇక తాను ఏ మాత్రం పసికూన కాదని, తన కంటే చిన్న జట్లు ఉన్నాయని నెదర్లాండ్స్(Netherlands) నిరూపించింది. ఇప్పటికే అగ్రశ్రేణి టీమ్ అయిన సౌతాఫ్రికాను ఓడించిన డచ్ జట్టు ఈరోజు బంగ్లాదేశ్(Bangladesh)ను కూడా మట్టికరిపించింది. తొలుత వికెట్లు టపటపా కోల్పోయినా తర్వాత కోలుకుని మెరుగైన స్కోరు సాధించిన నెదర్లాండ్స్.. ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో 229 రన్స్ కు ఆలౌట్ అయింది. మిగతా బ్యాటర్లు విఫలమైనా(Failure) కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(68; 89 బంతుల్లో 6×4) హాఫ్ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు అందించాడు. 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్ ఏ మాత్రం వెరవకుండా 200కు పైగా స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 70 పరుగులకే కీలక 6 వికెట్లు చేజార్చుకుంది. లిట్టన్ దాస్(3), తాంజిద్(15), మిరాజ్(35), శాంటో(9), కెప్టెన్ షకిబుల్(5), ముష్ఫికర్(1), మహ్మదుల్లా(20) ఇలా అంతా పెద్దగా ఆడకుండానే వెనుదిరిగారు. క్యాచ్ లు, ఫీల్డింగ్ విషయంలో నెదర్లాండ్స్ చురుగ్గా వ్యవహరించడంతో బంగ్లాకు పరుగులు రావడమే కష్టంగా మారింది. దీంతో బంగ్లా 42.2 ఓవర్లలో 142కు ఆలౌట్ అయి 87 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.