ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈరోజే గడువు ముగిసిపోనుంది. ఓటు నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఇచ్చిన గడువు ఈ రోజుతో పూర్తి కానుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఓటరు నమోదు కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు(Apply) చేసుకోవడానికి ప్రజలకు వెసులుబాటు కల్పించింది.
www.ceot.telangana.nic.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్హత(Educational Qualifications), వయసు(Age), ఆధార్ కార్డ్(Aadhar Card)తో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం BLOలు విచారణ జరిపి ఓటు హక్కు కల్పించనున్నారు.