ముందుగా కేసీఆర్ ను పదవి నుంచి దింపాలని, ఆ తర్వాతే ప్రజల నుంచి ఎంత దోచారో ప్రశ్నించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని మరోసారి స్పష్టం చేశారు. 2024లో దేశంలో ఏర్పడబోయేది హస్తం పార్టీయేనని, మోదీ సర్కారుకు కాలం చెల్లిందన్నారు. విజయభేరి యాత్రలో భాగంగా షాద్ నగర్, కల్వకుర్తి రోడ్ షోలలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కారు తనపై 24 కేసులు పెట్టిందని, ఇల్లు కూడా ఖాళీ చేయించిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ లూటీ చేశారని, తాము అధికారంలోకి వచ్చాక ఆయన దోచిన సొమ్మంతా ప్రజలకు పంచి పెడతామని రాహుల్ అన్నారు.
మేడిగడ్డకు రాహుల్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కుంగుబాటుకు గురైన మేడిగడ్డను పరిశీలించాలని రాహుల్ నిర్ణయించారు. గురువారం నాడు మేడిగడ్డను విజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర పార్టీ నేతలు దృష్టి సారించారు.