ఉద్యోగాలకు పోటీ ఎలా ఉందో ఉపాధ్యాయ నియామక పరీక్ష(TRT)కి వచ్చిన దరఖాస్తు(Applications)లే చెబుతున్నాయి. ఒక్కో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 53 మంది పోటీ పడుతుండగా.. SGT పోస్టుకు 26 మంది చొప్పున కుస్తీ పడుతున్నారు. TRT(Teachers Recruitment Test)కు అప్లికేషన్ల గడువు అక్టోబరు 28 అర్థరాత్రితో ముగిసింది. 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 91,931.. 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్స్(SGT) పోస్టులకు 66,376 అప్లికేషన్లు వచ్చాయి.
స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్(SGT), భాషా పండితులు, పీఈటీలతో కలిపి మొత్తం 5,089 పోస్టులకు అప్లికేషన్లు స్వీకరించారు. ఈ TRTకి 1,76,527 అప్లికేషన్లు రాగా.. SGT తెలుగు మీడియం కోసం 60,190 దరఖాస్తులు అందాయి. వచ్చే ఫిబ్రవరిలో ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నది.