ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన మూడో జాబితా(Third List)ను BJP విడుదల చేసింది. ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత 35 మందితో కూడిన లిస్టును రిలీజ్ చేశారు. ఫస్ట్ లిస్ట్ లో 52 మంది పేర్లు వెల్లడించగా.. సెకండ్ లిస్ట్ లో ఒక్కరి పేరు మాత్రమే ప్రకటించారు. మెదక్ జిల్లా ఆందోల్ లో బాబూ మోహన్, ఉప్పల్ లో ఎన్.వి.ఎస్.ప్రభాకర్, ఎల్.బి.నగర్ లో సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్ లో తోకల శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించారు. మొత్తంగా ఇప్పటివరకు 88 మంది పేర్లను పార్టీ హైకమాండ్ ప్రకటించింది.
అభ్యర్థుల జాబితా
బాన్సువాడ – యెండల లక్ష్మీనారాయణ
బోధన్ – వద్ది మోహన్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ – దినేశ్ కులచారి
సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
మలక్ పేట్ – సంరెడ్డి సురేందర్ రెడ్డి
అంబర్ పేట్ – కృష్ణాయాదవ్
జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి
సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
ముషీరాబాద్ – పూస రాజు
రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
ఎల్.బి.నగర్ – సామ రంగారెడ్డి
చేవెళ్ల – కేఎస్ రత్నం
పరిగి – భూనేటి మారుతి కిరణ్
అసిఫాబాద్ – అజ్మీరా ఆత్మారామ్ నాయక్
మంచిర్యాల – వీరబెల్లి రఘునాథ్
జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
మక్తల్ – జలంధర్ రెడ్డి
వనపర్తి – అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట – దేవని సతీశ్ మాదిగ
షాద్ నగర్ – అందె బాబయ్య
నారాయణపేట – కె.పాండురంగారెడ్డి
నల్గొండ – మాదగోని శ్రీనివాస్ గౌడ్
దేవరకొండ – కేతావత్ లాలూనాయక్
హుజూర్ నగర్ – చల్లా శ్రీలతారెడ్డి
ఆలేరు – పడాల శ్రీనివాస్
మంథని – చందుపట్ల సునీల్ రెడ్డి
మెదక్ – పంజా విజయ్ కుమార్
నారాయణఖేడ్ – జాన్ వాడే సంగప్ప
జహీరాబాద్ – రామచంద్ర రాజనరసింహ
పరకాల – కాళీ ప్రసాదరావు
పినపాక – పోడియం బాలరాజు
పాలేరు – నున్న రవికుమార్
సత్తుపల్లి – రామలింగేశ్వరరావు