రేపు(శుక్రవారం) మధ్యాహ్నం నుంచి మెట్ పల్లి(Metpally)-కోరుట్ల(Korutla) మధ్య రాకపోకలు మళ్లిస్తున్నారు. ముఖ్యమంత్రి KCR పర్యటన(CM Tour) దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. చౌలమద్ది వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ(Meeting) కారణంగా మెట్ పల్లి-కోరుట్ల మధ్య వాహనాల్ని దారి మళ్లించనున్నట్లు పోలీసులు తెలియజేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ రెండు పట్టణాల మధ్య రాకపోకలు నిలిపివేసి.. వెహికిల్స్ ను ఇతర రూట్లో దారి మళ్లిస్తున్నారు.
దారి మళ్లింపు ఇలా…
మెట్ పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్లాల్సిన వాహనాలు వేంపేట మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. వేంపేట-ధర్మారం-అయిలాపూర్ మీదుగా కోరుట్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రయాణికులు సహకరించాలని మెట్ పల్లి DSP వి.రవీంద్రరెడ్డి కోరారు.