ఎన్నో రోజుల నుంచి హడావుడి కనిపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలకు అసలు ముహూర్తం మొదలవుతున్నది. శాసనసభ ఎన్నికల(Assembly Elections)కు నేడు నోటిఫికేషన్ జారీ కానుండగా, వెంటనే నామినేషన్ల(Nominations) స్వీకరణ ప్రారంభమవుతుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 10 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారుల(RO) కార్యాలయాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఇందుకోసం RO ఆఫీసుల వద్ద ఏర్పాట్లు పూర్తి కాగా, పటిష్ఠ బందోబస్తు నడుమ ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నారు.
వారికే అనుమతి
RO(Returning Officer) కార్యాలయం వద్ద 100 మీటర్ల పరిధిలోకి కేవలం 3 వాహనాలకే అనుమతి ఉండగా, RO గదిలోకి అభ్యర్థి సహా మొత్తం ఐదుగురికే పర్మిషన్ ఉంది. ఈసారి సువిధ పోర్టల్ ద్వారా సైతం ఆన్ లైన్ నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్ వేశాక ప్రింటెడ్ కాపీని ROకు తప్పనిసరి(Mandatory)గా ఇవ్వాల్సి ఉంటుంది.