ఇప్పటికే విజయయాత్రతో దూసుకుపోతున్న భారత్ కు బిగ్ షాక్(Big Shock) తగిలింది. అత్యంత కీలక ఆటగాడు మొత్తం వరల్డ్ కప్(World Cup)కే దూరం కావాల్సి వచ్చింది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గత కొద్ది రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ సహా పలు కీలక మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని NCA(National Cricket Academy)లో చికిత్స తీసుకుంటున్న ఈ ప్లేయర్.. లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యేసరికి కోలుకుంటాడని అనుకున్నారు. నామమాత్ర లీగ్ మ్యాచ్ లకు అందుబాటులో లేకపోయినా సెమీస్ లో అడుగుపెడతాడని అంతా భావించారు. కానీ గాయం తగ్గకపోవడంతో పాండ్య ఇక మొత్తం ప్రపంచ కప్ నుంచే తప్పుకోవాల్సి వచ్చినట్లు BCCI వర్గాలు తెలిపాయి.
ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం
భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్య స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కింది. టీమిండియాలో ఇప్పటికే బుమ్రా, షమి, సిరాజ్ ఉండగా తాజాగా మరో సీమర్ కు ఛాన్స్ కల్పించారు. వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న భారత్.. దిగ్విజయ యాత్రతో దూసుకుపోతున్నది. ఆడిన ఏడింటికి ఏడింట్లో గెలిచి ఎదురన్నదే లేకుండా సాగుతున్నది. లీగ్ స్థాయిలో ఇంకో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. సెమీస్ బెర్త్ ఖాయం కావడంతో అందులో హార్దిక్ ఆడతాడన్న ఆశలు ఉండేవి. కానీ చివరకు ఆ ఆశలు అడియాసలయ్యాయి.