నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ(డిగ్రీ+బీఈడీ) కోర్సు నిర్వహించేందుకు రాష్ట్రంలో మూడు కాలేజీలకు మాత్రమే అర్హత దక్కింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, వరంగల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT), మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మాత్రమే కోర్సు అందుబాటులో ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసి బీఈడీని ఇతర కాలేజీల్లో చదవడానికి బదులుగా డిగ్రీతోపాటు కంటిన్యూగా బీఈడీ కూడా పూర్తి చేసే అవకాశం ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. 2023-24 ఏడాదికి గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET)కి అప్లై చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 178 పట్టణాలు, నగరాల్లో.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) పద్ధతిలో ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. మొత్తంగా 13 భాషల్లో ఈ పరీక్ష రాయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పిస్తోంది.
షెడ్యూల్ ఇలా…
ఆన్ లైన్ అప్లై 26-06-2023 నుంచి 19-07-2023(Up to 11:30 P.M)
అడ్మిట్ కార్డ్స్ డౌన్ లోడ్ ఎగ్జామ్ కు 3 రోజుల ముందు(NTA వైబ్ సైట్ ద్వారా)
వెబ్ సైట్స్ www.nta.ac.in, http://ncet.samarth.ac.in/