టాలీవుడ్లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించేవారు. ‘ధ్రువ’ మూవీ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. సురేందర్ రెడ్డి టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్గా అఖిల్ అక్కినేనితో ‘ఏజెంట్’ మూవీ తెరకెక్కించాడు సూరి. రిలీజ్‌కు ముందు ఈ మూవీపై భారీ హైప్ నెలకొనగా.. ఫలితం మాత్రం తేడా కొట్టేసింది. దీంతో స్టార్ హీరోలు ఎవరూ తనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో ఓ కుర్ర హీరోతో మీడియం బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు సూరి.
‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌కు సురేందర్ రెడ్డి చెప్పిన కథ తెగ నచ్చేసిందట. ప్రస్తుతం నిర్మాత కోసం వెతుకుతున్నారని టాక్. ప్రొడ్యూసర్ దొరికితే వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే, వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి ఎన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా సురేందర్ రెడ్డి హిట్ కొడతాడో లేదో చూడాల్సిందే.