
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కూడిన మూడో జాబితా(Third List)ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 16 మందితో కూడిన లిస్టును పార్టీ ప్రకటించింది. బోథ్, వనపర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ఆయన ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అభ్యర్థులు వీరే
కామారెడ్డి – ఎ.రేవంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్ – షబ్బీర్ అలీ
నారాయణఖేడ్ – సురేశ్ షెట్కార్
బోథ్ – ఎ.గజేందర్
బాన్సువాడ – ఏనుగు రవీందర్ రెడ్డి
చెన్నూరు – జి.వివేకానంద్
సిరిసిల్ల – కె.కె.మహేందర్ రెడ్డి
జుక్కల్ – తోట లక్ష్మీకాంతరావు
కరీంనగర్ – పురుమల్ల శ్రీనివాస్
డోర్నకల్ – జె.రామచంద్రునాయక్
వైరా – మాలోతు రామదాస్
సత్తుపల్లి – మట్టా రాగమయి
ఇల్లెందు – కోరం కనకయ్య
అశ్వారావుపేట – జె.ఆదినారాయణ
వనపర్తి – తూడి మేఘారెడ్డి
పటాన్ చెరు – నీలం మధు ముదిరాజ్