మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఈ మధ్యకాలంలోనే హస్తం పార్టీలో చేరి ఖమ్మంలో ప్రచారం కొనసాగిస్తున్న ఆయన.. IT దాడుల గురించి ప్రస్తావించారు. తన కుటుంబంపై ఐటీ దాడులు కూడా చేయిస్తారు అని మాట్లాడారు. ‘కొద్దిరోజుల్లోనే నా కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు చేస్తారు.. మా పార్టీ నాయకులకు ఈ ఇబ్బందులు కొద్దిరోజుల వరకు తప్పవు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. KCR అవినీతి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో లీకులు ఏర్పడి కుంగిపోయిందని, దీనిపై కేంద్ర సంస్థలే నివేదిక ఇచ్చినా చర్యలు లేవని విమర్శించారు.
కొందరు పోలీసులు అధికార పార్టీ BRSకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. IT, EDలు కేవలం కాంగ్రెస్ లీడర్లపైనే ఫోకస్ చేస్తున్నాయని, నన్ను వెళ్లగొట్టిన పార్టీయే కేసీఆర్ సర్కారు సూచనల మేరకు దాడులు చేయబోతున్నదని చెప్పారు.