PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్ లో ఓడిస్తే పట్నం నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇప్పిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో KCR కాళ్లు మొక్కి అయినా సరే మాట నిలబెట్టుకున్నానని అన్నారు. కొడంగల్ లో రోడ్ షో నిర్వహించిన KTR.. రేవంత్ గెలిస్తే అరాచకాలు పెరుగుతాయని తెలిపారు. రేవంత్ గెలిస్తే కొడంగల్ ను ప్లాట్లు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటారని, ఇక ప్రజలకు మిగిలేది ఏమీ ఉండదని విమర్శించారు.
కాంగ్రెస్ ను గెలిపించిన కర్ణాటక ప్రజలు ఇప్పుడు చెంపలు వేసుకుంటున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లి చిప్పకూడు తింటారని, ఆయన పైసల్ని నమ్ముకుని ఓటర్లను కొంటుండు అని KTR ఆరోపించారు. జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా, జైలుకు వెళ్లే శాసనసభ్యుడు కావాలా అంటూ ప్రజలను ప్రశ్నించారు.