మిగిలిపోయిన స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. సందిగ్ధం నెలకొన్న పరిస్థితుల్లో నామినేషన్ల గడువు ముగుస్తుండగా చివరకు మిగిలిన 5 స్థానాలకు క్యాండిడేట్ల పేర్లను వెల్లడించింది. ఇప్పుడు ప్రకటించిన ఐదు పేర్లలో మూడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవే ఉన్నాయి. ఇతర పార్టీలతో పొత్తులు, తమ పార్టీలోని రెండు వర్గాల హోరాహోరీ వల్ల ఈ స్థానాలను ఇప్పటిదాకా పార్టీ నేతలు పెండింగ్ లో పెట్టారు. పటాన్ చెరు సెగ్మెంట్ విషయంలో ఇద్దరు ప్రధాన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. MLA జగ్గారెడ్డి, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య పరస్పర విమర్శలు తలెత్తాయి.
తాజా జాబితా ఇది
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి
సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తుంగతుర్తి – మందుల సామ్యేల్
పటాన్ చెరు – కట్టా శ్రీనివాస్ గౌడ్
చార్మినార్ – ముజీబ్ ఉల్లా షరీఫ్