ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు(Nominations) సమర్పించేందుకు నేటితో గడువు ముగిసిపోతున్నది. ఎన్నికల సంఘం ప్రకటించిన మేరకు ఈ రోజు నామినేషన్ల కార్యక్రమం పూర్తి కానుండగా, ఇక పరిశీలన మొదలవుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్దయెత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 3న మొదలైన ఈ కార్యక్రమానికి తొలి నాలుగైదు రోజులు అంతగా స్పందన రాలేదు. కానీ బుధవారం నుంచి RO కార్యాలయాలకు అభ్యర్థుల రాక ప్రారంభమైంది. గురువారం నాడు ఒక్క రోజే 1,077 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు, మంత్రులు, MLAలు సహా రాష్ట్రవ్యాప్తంగా భారీగా నామినేషన్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్, BJPలకు సంబంధించిన తుది జాబితాలు(Final Lists) కూడా రావడంతో చివరి రోజైన ఇవాళ పూర్తిస్థాయిలో నామినేషన్లు దాఖలు కానున్నాయి.
13న పరిశీలన, 15 వరకు విత్ డ్రాలు
నామినేషన్ల స్వీకరణ పూర్తవుతుండగా ఇక అధికార యంత్రాంగం వాటి పరిశీలనపై దృష్టి పెట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా సెగ్మెంట్ల వారీగా వచ్చిన నామినేషన్లను ఈ నెల 13న పరిశీలన చేపట్టనుండగా.. 15వ తేదీ వరకు ఉపసంహరణ(With Draw)కు అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిందంటే ఇక పోలింగ్ కు రెడీ అన్నమాట.