దేశంలో రోజురోజుకూ వాతావరణం తీవ్రస్థాయిలో కలుషితం అవుతున్నది. విచ్చలవిడిగా వెలువడుతున్న కాలుష్యంతో కొన్ని మెట్రో నగరాల్లో శ్వాస తీసుకునే అవకాశమే లేకుండా పోతున్నది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఇప్పుడిప్పుడే కేంద్రం చర్యలు చేపడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే కీలక నిర్ణయం తీసుకుంది. ఎడాపెడా కార్లను ప్రొడక్ట్ చేస్తూ నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలకు దిగుతోంది. గత జనవరి-మార్చికి గాను కొన్ని కంపెనీలకు వందల కోట్ల రూపాయల్ని ఫైన్ విధించింది. ఎడాపెడా కాలుష్యం వెదజల్లుతున్న కార్లను ఉత్పత్తి చేసి, వాటిని సరిచేయనందుకు గాను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ(BEE) సిఫార్సు మేరకు కఠిన చర్యలకు దిగింది.
ఫైన్ పడ్డ కంపెనీలివే…
కార్బన్ డై-ఆక్సైడ్ విడుదలకు కారణమవుతున్న కార్ల కంపెనీలు.. కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ(CAFE) నిబంధనల్ని ఉల్లంఘించాయంటూ ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఈ ఫైన్ వేసింది. మోడల్ ను బట్టి ఎన్ని కార్లు ఉత్పత్తి చేశారు.. ఎన్నింటిని అమ్మారు అన్న కోణంలో లెక్కగట్టి ఆయా కంపెనీలకు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. హ్యుందాయ్, కియా, హోండా కార్స్, రెనాల్ట్, స్కోడా ఆటో, వోక్స్ వాగన్ ఇండియా, నిస్సాన్ కంపెనీలకు భారీయెత్తున ఫైన్ విధించింది. విపరీత పొల్యూషన్ వల్ల AQI(Air Quality Index) దెబ్బతిని ప్రమాద ఘంటికలు మోగుతుండటంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం చెందింది. ఉల్లంఘనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో కేంద్రం ఈ చర్యలకు ముందుకు వచ్చింది.
ఏయే కంపెనీలకు ఎంతెంత…!
ఎనర్జీ కన్జర్వేషన్(చట్టం) బిల్ 2022 ప్రకారం పొల్యూషన్ నిబంధనలు(Pollution Norms) ఉల్లంఘించిన కంపెనీలకు ఫైన్ విధించవచ్చు. కిలోమీటరుకు 0-4.7 గ్రాముల కన్నా ఎక్కువగా CO2 వదిలే వెహికిల్స్ కు 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల పాటు రోజుకు రూ.10,000తోపాటు అదనంగా మరో రూ.10 లక్షల్ని విధించగా ఇప్పుడా ఫైన్ పెరిగింది. తాజాగా అది రూ.25,000కు చేరుకోగా.. 0-4.7 లెవెల్ దాటితే ఆ ఫైన్ కాస్తా రూ.50 వేలు అవుతుంది. ఈ మేరకు వివిధ కంపెనీలకు భారీయెత్తున ఫైన్ పడగా.. మరికొన్ని కంపెనీలు దీన్నుంచి బయటపడ్డాయి. అయితే దీనిపై నిస్సాన్ కంపెనీ స్పందిస్తూ తమకు కేంద్రం నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపింది.
కంపెనీ | ఫైన్(రూ.కోట్లల్లో) |
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ | 373.7 |
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ | 369.3 |
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ | 103 |
రెనాల్ట్ ఇండియా ప్రై.లిమిటెడ్ | 75.1 |
స్కోడా ఆటో వోక్స్ వాగన్ ఇండియా ప్రై.లిమిటెడ్ | 59.2 |
నిస్సాన్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ | 41.2 |
ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ | 0.7 |