ఫిలిం స్టార్లకు అభిమానులు ఉండటం కామన్. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అసలు ఆ అభిమానానికి హద్దులు లేవా? అనిపిస్తుంది. తాజాగా ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియాకు ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో తమన్నాను ఓ మహిళా అభిమాని కలిసింది. ఇద్దరి ఇంటరాక్షన్ సందర్భంగా సదరు అభిమాని తమన్నా కాళ్లు కూడా మొక్కింది. ఈ సడెన్ ఇన్సిడెంట్‌కు తమన్నా ఎమోషనల్ అయిపోయింది. అంతేకాదు ఆ అభిమానితో మాట్లాడుతున్న క్రమంలోనే ఆమె తన చేతిపై తమన్నా ఫేస్‌తో కూడిన పచ్చబొట్టు వేయించుకున్నట్లు చూపించింది. దీంతో ఆమె అభిమానానికి ముగ్ధురాలైన తమన్నా.. తనను హగ్ చేసుకుని కాస్త ఎమోషనల్ అయింది. మీడియా ఫొటోగ్రాఫర్.. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తమన్నా ఇటీవలే ‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. అరుణిమ శర్మ దర్శకత్వం వహించిన సిరీస్‌లో జూన్ 15 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు నటుడు విజయ్ వర్మతో కలిసి ఆమె నటించిన ‘లస్ట్ స్టోరీస్2’ ఆంథాలజీ సిరీస్ జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్గా విడుదలైన ట్రైలర్లో తమన్నా.. తన బోల్డ్నెస్తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. విజయ్‌తో హాట్ సీన్స్‌లో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించింది మిల్కీ బ్యూటీ. ఇవేగాక తెలుగులో మెగాస్టార్ సరసన ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ్లో ‘జైలర్’ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు జోడీగా కనిపించనుంది. ఈ రెండు చిత్రాలు కూడా ఆగస్టులో విడుదల కానున్నాయి.