అసలే ఎన్నికలు(Assembly Elections).. ఇక పార్టీలకు చెందిన లీడర్ల(Party Leaders) హడావుడి మామూలుగా ఉండదు మరి. అందునా అదో పెద్ద ప్రమాదం.. చనిపోయింది తొమ్మిది మంది. ఒకరిని మించి మరొకరున్నట్లుగా పరామర్శలు, ఓదార్పులు. ఒకటేమిటి.. అన్ని పార్టీల నుంచి ఇదే సందడి. కానీ వచ్చినవారు వచ్చినట్లు కేవలం పరామర్శించి మాత్రమే వెళ్లకుండా పెద్ద దుమారానికి కారణమయ్యారు. హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లోని బిల్డింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనాస్థలిలో కాంగ్రెస్, మజ్లిస్ గొడవకు దిగాయి. ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. నాంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఫిరోజ్ ఖాన్.. బాధితులతో మాట్లాడి తిరిగి వెళ్తున్న సమయంలో MIM కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి తీవ్రరూపు(Serious) దాల్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో పోలీసుల లాఠీఛార్జి చేసి మరీ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల్ని తరిమికొట్టారు.
ఒకవైపు మృతులతో బాధిత కుటుంబాలు ఆవేదనలో ఉంటే మరోవైపు రెండు పార్టీలు రాజకీయం చేయడం వివాదాస్పదంగా తయారైంది. కాంగ్రెస్, మజ్లిస్ కు చెందిన నాయకులు, కార్యకర్తలు తీరుపై అందరూ విమర్శలు చేశారు.