
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు(PM Kisan Funds) రేపు అకౌంట్లలో పడనున్నాయి. రైతు పెట్టుబడి సాయంగా ఎకరాకు సంవత్సరానికి రూ.6.000 అందిస్తున్న మోదీ సర్కారు.. మూడు విడత(Three Phases)ల్లో రూ.2,000 చొప్పున అందజేస్తుంది. 15వ విడత కింద 8 కోట్ల మంది రైతుల అకౌంట్లలో ఈ నిధులు జమ చేయనుంది. ఝార్ఖండ్(Jharkhand) లో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ-కేవైసీ చేయించుకున్న లబ్ధిదారులకు మాత్రమే నిధులు అందనున్నాయి. అయితే ఈ-కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అన్నది వెబ్ సైట్ లోకి చూడాల్సి ఉంటుంది.
ఇలా చేయాలి…
http://pmkisan.gov.in/ లోకి వెళ్లాలి.
ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత Benificiery List పై క్లిక్ చేయాలి.
రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని Get Report అనే దానిపై క్లిక్ చేయాలి.