రాష్ట్రంలో నామినేషన్ల పరిశీలన(Nominations Scrutiny) పూర్తయిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా క్యాండిడేట్లు గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనూ పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. గజ్వేల్ లో రాష్ట్రంలోనే అత్యధికంగా 114 మంది బరిలో ఉండగా.. తర్వాతి స్థానం మేడ్చల్ నిలిచింది. అక్కడ 67 మంది అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. నామినేషన్ల తుది పరిశీలన పూర్తి చేసిన అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,898 మంది పోటీలో ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం 606 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
రాష్ట్రంలో అత్యధికులు పోటీ చేస్తున్న నియోజకవర్గంగా గజ్వేల్ నిలిస్తే అత్యల్పంగా నామినేషన్లు వచ్చిన సెగ్మెంట్ నారాయణపేట. CMపై పోటీకి భారీయెత్తున బరిలోకి దిగితే.. అటు PCC ప్రెసిడెంట్ పోటీ చేసే స్థానమైన కొడంగల్ లో తక్కువ స్థాయిలో నామినేషన్లు వచ్చాయి.
నియోజకవర్గాల వారీగా
గజ్వేల్ – 114
మేడ్చల్ – 67
కామారెడ్డి – 58
ఎల్.బి.నగర్ – 50
కొడంగల్ – 15
బాల్కొండ – 9
నారాయణపేట – 7