
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిపిన తనిఖీ(Checkings)ల్లో రూ.571 కోట్లు పట్టుబడ్డట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇందులో సామాన్యులవే ఎక్కువ ఉండగా.. రాజకీయ నాయకుల నుంచి స్వాధీనం చేసుకున్నవి చాలా తక్కువగా ఉన్నాయి. అక్టోబరు 9 నుంచి రాష్ట్రంలో సోదాలు, చెకింగ్స్ జరుగుతుండగా.. 5 వారాల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో రికవరీ అయింది. నగదు, బంగారం, లిక్కర్, బహుమతుల రూపేణా తరలిస్తున్న ఇతర వస్తువుల్ని పోలీసులు పట్టుకున్నారు. గత 24 గంటల్లోనే 12.80 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(Chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు.
ఇప్పటిదాకా రూ.198.30 కోట్ల నగదు, రూ.78.81 కోట్ల ఆభరణాలు, రూ.85 కోట్లకు పైగా విలువైన మద్యం(Liquor), రూ.33 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు(Drugs)ను పట్టుకున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. రూ.76 కోట్లకు పైగా విలువైన కుక్కర్లు, చీరలు, బియ్యం, ఇతర కానుకల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.