స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో 8,000 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాల అప్లికేషన్ ప్రాసెస్ శుక్రవారం(నవంబర్ 17) నుంచి ప్రారంభమైంది.
డిగ్రీ ఉత్తీర్ణులై వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులూ అప్లై చేయవచ్చు.
రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
వచ్చే ఏడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఆన్లైన్లో జరిగే ప్రిలిమ్స్‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ సిలబస్‌కు సంబంధించి మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి మెయిన్స్‌కు అర్హత కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్స్ స్టార్ట్: నవంబర్ 17
అప్లికేషన్స్ ఎండ్: డిసెంబర్ 7
ప్రిలిమ్స్: జనవరి, 2024
మెయిన్స్: ఫిబ్రవరి, 2024