Published 23 Nov 2023
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court)లో తొలి మహిళా న్యాయమూర్తిగా, రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన జస్టిస్ ఫాతిమా బీబీ కన్నుమూశారు. 96 సంవత్సరాల జస్టిస్ ఫాతిమా.. చికిత్స(Treatment) తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. కేరళకు చెందిన ఈ మహిళా జడ్జి 1989-92 కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ముస్లిం సామాజికవర్గం నుంచి న్యాయవ్యవస్థ(Judiciary)లో అత్యున్నత స్థాయికి ఎదిగిన తొలి మహిళ కూడా ఫాతిమా బీబీ కావడం విశేషం. ఆమె నాలుగేళ్లపాటు 1997-2001 వరకు తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. అంతకుముందు మరో నాలుగేళ్ల పాటు 1993-1997 వరకు NHRC(National Human Rights Commission)లో విధులు నిర్వర్తించారు.
చిక్కుల జయలలితకు చుక్కలు
కేరళలోని పథనంతిట్ట జిల్లాకు చెందిన ఫాతిమా.. కొల్లాం ఆసుపత్రిలో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె హయ్యర్ స్టడీస్ అంతా తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్, ప్రభుత్వ లా కాలేజీల్లో సాగింది. తమిళనాడు గవర్నర్ గా పనిచేస్తున్న సమయంలో జయలలిత ప్రభుత్వ విధానాలను నిరంకుశంగా తిప్పికొట్టారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పడిన ముఖ్యమంత్రి జయలలిత ఎలక్షన్లలో పోటీ చేయాల్సి రావడం, ఆ సమయంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆమె వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని అప్పట్లోనే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. అనంతర కాలంలో కేంద్రంలోని BJP ప్రభుత్వంతో పడకపోవడంతో గవర్నర్ పదవిని వదిలిపెట్టారు. ఫాతిమాబీబీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ఆమె సేవలను కొనియాడుతూ రాష్ట్రానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టారని గుర్తు చేసుకున్నారు.