Published 24 Nov 2023
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తరించాలనుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నేడు టికెట్లను విడుదల చేస్తున్నది. రూ.300కు సంబంధించిన ప్రత్యేక దర్శన టికెట్లను ఈ రోజు విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన టికెట్లను భక్తులకు TTD అందుబాటులో ఉంచనుంది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ ద్వారా వీటిని బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. అటు తిరుమలలో బస చేసేందుకు గాను గదుల(Rooms) కోటా టికెట్లు సైతం ఈరోజు అందుబాటులో ఉంటున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు వీటిని విడుదల చేస్తారని దేవస్థానం వర్గాలు తెలిపాయి.
నిమిషాల వ్యవధిలోనే అమ్మకాలు
తిరుమల శ్రీవారి దర్శనాల కోసం ఆన్ లైన్ లో ఉంచే వేలాది టికెట్లు.. నిమిషాల వ్యవధిలో అమ్ముడవుతుంటాయి. దీన్నిబట్టే తెలుసుకోవచ్చు.. శ్రీవారి దర్శనభాగ్యం కోసం ఎంతమంది తపిస్తారోనని. స్వామి వారిని సాధారణ రోజుల్లో 50 నుంచి 70 వేల మంది, వారాంతపు రోజుల్లో 60 నుంచి 90 వేల మంది దాకా దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం లక్షల మంది కొండపైకి చేరుకుంటారు.