Published 25 Nov 2023
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్(Petrol, Diesel)పై వ్యాట్(Value Added Tax) తగ్గిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పెట్రోలు, డీజిల్ పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే KCR మాత్రం పెంచుకుంటూ పోయారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా పన్నులు తగ్గిస్తామని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించిన అమిత్ షా.. పరీక్షల పేపర్లు లీక్ చేసి దారుణమైన కుంభకోణానికి పాల్పడ్డారన్నారు.
మతపరమైన రిజర్వేషన్లకు చెల్లుచీటి
నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ సర్కారు మోసం చేసిందని, MIMకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని విమర్శించారు. BRS ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్న హోంమంత్రి.. రాష్ట్రంలో గెలిస్తే ఆడపిల్లల మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తామని గుర్తు చేశారు. BJP అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు.