Published 25 Nov 2023
ఎన్నికల నిబంధనల్ని(Model Code Of Conduct) ఉల్లంఘించిన ఏ ఒక్కర్నీ ఎన్నికల సంఘం విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన EC.. ఇప్పుడు ఆయన తనయుడు KTRను కూడా వదిలిపెట్టలేదు. నిబంధనల్ని ఉల్లంఘించారంటూ మంత్రికి నోటీసులు పంపించింది. రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ ఆఫీసు అయిన ‘టీ’ వర్క్స్ ను వాడుకున్నారని ఫిర్యాదు అందింది. ‘టీ’ వర్క్స్ లో సమావేశం నిర్వహించిన KTR.. ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. అదే సమయంలో TSPSCని ప్రక్షాళన చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాన్ని రాజకీయంగా వాడుకున్నారన్న కంప్లయింట్ ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు.. నిబంధనల్ని కె.తారకరామారావు ఉల్లంఘించినట్లు నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు నోటీసులు పంపిస్తూ రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
తండ్రి తనయులిద్దరికీ
ఇప్పటికే ముఖ్యమంత్రి KCRకు సైతం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ వార్నింగ్ తో కూడిన లెటర్ ను పంపించింది. రెచ్చగొట్టే ప్రసంగాలతో ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నారన్న NSUI రాష్ట్ర అధ్యక్షుడి ఫిర్యాదుతో విచారణ జరిపించింది. అది నిజమని తేలడంతో సీరియస్ వార్నింగ్ ఇస్తూ మరోసారి హద్దు దాటకూడదని స్పష్టం చేసింది.