BMW సంస్థ నుంచి లేటెస్ట్ లగ్జరీ బైక్ విడుదలైంది. M 1000 RR మోడల్ బైక్ మార్కెట్లోకి వచ్చేయగా… దీని ధర రూ.49 లక్షల(ఎక్స్ షోరూం) నుంచి మొదలవుతుంది. M 1000 RR కాంపిటీషన్ పేరిట వచ్చిన మరో మోడల్ బైక్ ధరను… రూ.55 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ప్రీ ఆర్డర్లన్నీ మోటోరాడ్ ఇండియా డీలర్ల వద్ద నేటి(జూన్ 28) నుంచి ప్రారంభించినట్లు తెలిపింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన BMW.. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా లేటెస్ట్ వెర్షన్ లో వెహికిల్స్ ను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగానే లేటెస్ట్ బైక్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
లేటెస్ట్ బైక్ ఫీచర్లు
999 సీసీతో కూడిన ఇంజిన్
3.1 సెకన్లలోనే 100 కి.మీ. వేగం
గరిష్ఠ వేగం 314 కిలోమీటర్లు
రెయిన్, రోడ్, రేస్, రేస్ ప్రో 1-3 రైడ్ మోడ్స్