Published 30 Nov 2023
స్టార్ కథానాయకుడు అల్లు అర్జున్ కు వింత అనుభవం ఎదురైంది. ఓటు వేసేందుకు వచ్చిన ఆయన.. తనకు ఎదురైన పరిస్థితితో మరింత సేపు క్యూలోనే నిలబడాల్సి వచ్చింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని BSNL సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ కు చేరుకున్నారు. పోలింగ్ ప్రారంభమయ్యే ఉదయం ఏడు గంటల కన్నా ముందే ఆయన 153వ పోలింగ్ బూత్ కు వెళ్లారు. తన వంతు వచ్చే వరకు అందరిపాటుగా క్యూలోనే ఉన్నారు. క్రమంగా ఒక్కొక్కరుగా ఓటు వేసుకుంటూ వెళ్తున్న సమయంలోనే అసలు సమస్య వచ్చి పడింది.
మొరాయించిన ఈవీఎం
అల్లు అర్జున్ ఓటు వేయాల్సిన EVM(Electronic Voting Machine) మొరాయించింది. టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఈవీఎం ఆగిపోవడంతో చేసేదిలేక ఆయన అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో అక్కడి ఉద్యోగులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. టెక్నికల్ సిబ్బందిని రప్పించి EVMను సరిచేస్తున్నారు. ప్రారంభంలోనే ఇలాంటి వింత అనుభవం ఎదురవడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. అయితే ఈవీఎంను సరిచేయడంతో అల్లు అర్జున్ ఓటు వేసి వెళ్లిపోయారు.