Published 30 Nov 2023
ఎగ్జిట్ పోల్స్(Exit Polls) చూసి పార్టీ కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వాటికి అంత శాస్త్రీయత ఉందని అనుకోవట్లేదని మంత్రి KTR అన్నారు. 2018లో తెరాస ఓడిపోతుందని చాలా సంస్థలు(Organizations) చెప్పాయని, అయితే ఒక్క సర్వే సంస్థనే కరెక్ట్ గా అంచనా వేసిందని గుర్తు చేశారు. అలా గత ఎన్నికల్లో అంచనాలు అన్నీ తప్పిపోయినందున ఈసారి వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ను నమ్మాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలియజేశారు. ‘అవి మాకు వ్యతిరేకంగా ఉండటం ఇప్పుడు కొత్తేమీ కాదు.. అయితే ఇప్పటివరకు 80కి పైగా స్థానాలు వస్తాయనుకున్నాం.. కానీ అవి 70కి పరిమితం కావచ్చు.. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన సర్వేలు జరుగుతాయి.. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరుతున్నా’ అని కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఇంచుమించి అన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. BRSపై స్వల్ప మెజారిటీతో హస్తం పార్టీ పాలనా పగ్గాలు చేపడుతుందని జోస్యం చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో KTR పార్టీ కార్యకర్తలు స్థైర్యం నింపేలా మాట్లాడారు. ఇవన్నీ ఇలా ఉంటే మరో మూడు రోజుల్లో తెలుస్తుంది అసలు కథేంటో.