ఎన్నికల విధుల్లో భాగంగా పోలింగ్ కోసం సేవలందించిన ఉద్యోగులకు ఎలక్షన్ కమిషన్ రేపు సెలవు(Holiday) ప్రకటించింది. డ్యూటీకి అటెండ్ అయిన అందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(CEO) వికాస్ రాజ్ ఆదేశించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary)ని ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రానికి పోలింగ్ ముగిసినా EVMలు అప్పగించేందుకు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు సిబ్బంది విధుల్లో ఉన్నారు. కొన్ని పోలింగ్ బూత్ ల్లో జనాల్ని బట్టి రాత్రి వరకు డ్యూటీ చేసి ఆ తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ లకు చేర్చే అర్థరాత్రి వరకు విధుల్లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పూట రవాణా సౌకర్యం లేని ఉద్యోగులు ఎక్కడికక్కడే ఉండిపోయి రేపు ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం.. రేపు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కన్నా ముందుగానే ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వికాస్ రాజ్ దృష్టికి తీసుకెళ్లారు.