Published 01 Dec 2023
తెలంగాణలో తమ పార్టీ లేదని, కాబట్టి అక్కడ ఎవరినీ గెలిపించాల్సిన అవసరం లేదని AP మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణ దయాదాక్షిణ్యాలపైనే ఇంకా ఆధారపడాలా అంటూ నాగార్జునసాగర్ నీటి విషయంలో స్పందించారు. మేము నిన్న చేసింది కరెక్టేనన్న అంబటి.. విభజన సయమంలో ప్రాజెక్టును గేట్లను చెరి సగం పంచారని గుర్తు చేశారు. APకి సంబంధించిన గేట్లను కూడా తెలంగాణ అధికారులే ఆపరేట్ చేస్తున్నారని, కుడి కాల్వ నిర్వహణ(Maintainance) తెలంగాణ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు.
నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. బుధవారం అర్థరాత్రి తెలంగాణ వైపు గేటు దూకిన AP పోలీసులు.. తెలంగాణ భద్రతా సిబ్బంది ఫోన్లు లాక్కున్నారు. 26 గేట్లకు గాను 13వ గేటు వద్ద ఫెన్సింగ్ వేసి నీటిని వదులుకున్నారు. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ఉండటంతో అధికారులెవరూ అందుబాటులో లేకుండా పోయారు. ఈ ఘటనపై తెలంగాణ SPF(Special Protection Force) ఫిర్యాదు మేరకు AP పోలీసులతోపాటు ఇరిగేషన్ అధికారులపై కేసు ఫైల్ చేశారు.