నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలి రౌండ్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఫస్ట్ రౌండ్ లీడ్ సాధించారు. ఇక గజ్వేల్ లో KCR స్వల్ప ఆధిక్యం దిశగా సాగుతున్నారు. అటు కామారెడ్డి, కొండగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ వేశారు. సిద్దిపేటలో తన్నీరు హరీశ్ రావు, స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి ముందంజలో ఉన్నారు.