కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి.. ఎన్నికల కౌంటింగ్ లో హవా చూపిస్తున్నారు .మూడో రౌండ్ ముగిసే సరికి 4,000 పై చిలుకు ఓట్లతో దూసుకుపోతున్నారు. అటు కామారెడ్డిలోనూ ఆయన స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈసారి రేవంత్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొడంగల్ లో BRS అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న PCC అధ్యక్షుడు.. CM బరిలో నిలిచిన కామారెడ్డిలోనూ హవా చూపిస్తున్నారు.