కార్పొరేట్ కంపెనీల బోర్డు మీటింగ్స్ లో మహిళల ప్రాతినిధ్యం ఇంకా పెరగాల్సిన అవసరముందని SBI ఎక్స్ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. మైండ్ సెట్ లో మార్పులు రావడం ద్వారా దృఢమైన సంకల్పం దిశగా సాగాలంటే మహిళల పాత్ర పెరగాలన్నారు. 200 సంవత్సరాల చరిత్ర గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అధినేత్రిగా లీడర్ షిప్ నిర్వర్తించిన అరుంధతీ.. 2013లో ఆ బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. క్లౌడ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ సేల్స్ ఫోర్స్ ఇండియాతో ఆమె… 2020లో ఛైర్ పర్సన్, CEOగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు.
భారతీయ వ్యాపార సామ్రాజ్యంలో ‘డిజిటల్ పరివర్తన’ తప్పక కలిగి ఉండాలని, ఆ తరహా లావాదేవీలు మరింత ఎక్కువ కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పనికిరాని విధానాలతో కాలం నెట్టుకొచ్చే సంస్థలు మనుగడ సాగించలేవని… డేటా, నైపుణ్యాలకు సంబంధించిన ఖాళీలు గల సంస్థలు దివాలా తీస్తాయన్నారు. నిరంతరం అప్డేట్ చేసుకుంటూ టెక్నాలజీతోపాటు డిజిటల్ సిస్టమ్ ను ఉపయోగిస్తే తిరుగు ఉండదని అరుంధతీ భట్టాచార్య గుర్తు చేశారు.