Published 03 Dec 2023
అత్యంత ఆసక్తికరంగా మారిన కామారెడ్డి(Kamareddy)లో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన.. మంచి లీడ్ తో దూసుకుపోతున్నారు. అటు కొండగల్ లోనూ రేవంత్ హవా నడుస్తోంది. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి PCC అధ్యక్షుడికి 5,687 ఓట్ల ఆధిక్యం లభించింది. కామారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలైన రేవంత్ లీడ్.. తొలి రౌండ్ సహా ఐదో రౌండ్ వరకు నిరంతరాయం(Continue)గా కొనసాగుతున్నది. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు BJP నుంచి వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు.
రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. తాను పోటీ చేస్తున్న కామారెడ్డిని వదిలిపెట్టలేదు. ఇక్కడి ప్రచారానికి పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని తీసుకురావడంతోపాటు పెద్దయెత్తున శ్రేణుల్ని మోహరించారు. అప్పటికే సీనియర్ నేత షబ్బీర్ అలీకి పట్టు ఉండటంతో రేవంత్ కు పడే ఓట్లకు ఇబ్బందుల్లేకుండా పోయాయి.