Published 03 Dec 2023
రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాలు పలువురు అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. కేసీఆర్ సర్కారులోని కీలక మంత్రులుగా భావిస్తున్న నేతలు పలు రౌండ్లు ముగిసినా ఇంకా వెనుకబాటులోనే ఉండిపోతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా చాలా రౌండ్లు లెక్కించాల్సి ఉన్నా తొలి నాలుగైదు రౌండ్లలో ఏ మాత్రం ముందంజ వేయలేకపోవడం అనుమానాలకు కారణమవుతున్నది. మొత్తంగా రాష్ట్రంలోని ఆరుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో, ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో ఇతర పార్టీల అభ్యర్థుల కన్నా వెనుకపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తిలో, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో కష్టాలు పడుతున్నారు. అటు ఖమ్మం నుంచి పోటీ చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, దేవాదాయ శాఖ మంత్రి అలోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ లో ఓట్లు రాబట్టుకోవడంలో వెనుకపడ్డారు.