కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం(Counting Centre)లో చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గంగుల కమలాకర్ తనపై స్వల్ప మెజారిటీతో ఉన్నందున రీకౌంటింగ్ చేపట్టాలని బండి సంజయ్ పట్టుబడుతున్నారు. ప్రస్తుతానికి కమలాకర్ కేవలం 300 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కమలం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్.. ముందునుంచీ మంత్రి గంగుల కమలాకర్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రతి రౌండ్ లోనూ ఈ ఇద్దరి మధ్యే తీవ్రమైన పోటీ కనిపించింది.
చివరకు వీరి మధ్య ఆధిక్యం కూడా వందల్లోకి చేరుకోవడంతో మరోసారి కౌంటింగ్ చేపట్టాలంటూ BJP ఏజెంట్లతోపాటు అభ్యర్థి సంజయ్ పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులతో తీవ్రస్థాయిలో చర్చిస్తున్న ఆయన.. తాను గెలిచేందుకే ఎక్కువ అవకాశాలున్నాయంటూ వాదిస్తున్నారు.