Published 07 Dec 2023
అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానాలు(Special Invitations) పంపడం.. గతంలో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం.. ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయటం వంటి క్రతువు(Programme)తో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్నది. ఎల్.బి.స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి వీరు, వారు అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి చేసే ప్రసంగం ఎలా ఉంటుందన్న దానిపైనే అందరిలోనూ ఆసక్తి కనపడుతున్నది.
ముఖ్యంగా నిరుద్యోగులు మాత్రం ఈ సర్కారుపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో లీకేజీలతో మానసికంగా బాగా కుంగిపోయిన ఉద్యోగార్థులు.. ఇప్పుడు రేవంత్ చేసే ప్రకటనపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన రేవంత్.. బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుసరించే విధానాలను ఎలా ప్రజలకు వివరిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా తయారైంది.
సోనియా, రాహుల్ తోపాటు ఇండియా కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, PCC ప్రెసిడెంట్లు హాజరవుతున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. తెలంగాణ నూతన గతిని నిర్దేశించేలా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారనడంలో సందేహం లేదు. ఆరు గ్యారంటీలతో ఆరంభించే ఈ కొత్త సర్కారు.. ఎంత మందికి మంత్రి పదవులు ఇవ్వనుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.